News March 21, 2024

ప్రకాశం జిల్లాలో ట్రాక్టరు బోల్తా.. డ్రైవర్ మృతి

image

త్రిపురాంతకం మండలం రాజుపాలెంకు చెందిన గంపసాని సింహాద్రి (20) ఇటుకల బట్టీలో ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం ఇటుకల లోడు ట్రాక్టరును తీసుకుని త్రిపురాంతకం వస్తున్న క్రమంలో చెరువు చప్టాపై స్పీడ్ బ్రేకర్ వద్ద ఆదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఇటుకలు సింహాద్రిపై పడ్డాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసి వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News September 3, 2025

ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News September 3, 2025

త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్‌వీల్ వ్యాన్- బైక్ ఒకదానికొకటి ఢీకొని ఓ మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 3, 2025

ప్రకాశం జిల్లాలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్..!

image

ప్రకాశం జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లెయిములకుగాను రూ.3.25 కోట్ల రాయితీలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంజూరు చేశారు. బుధవారం ఆమె అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను గడువు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.