News June 17, 2024

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులు కరవు బృందం పర్యటన

image

రబీలో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు రితేశ్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరవు ప్రభావిత జిల్లాల్లో 18వతేది నుంచి 21 వరకు పర్యటించనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 మంది సభ్యులు మూడు బృందాలుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడతారు. ఇందులోని ఒక బృందం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితి తెలుసుకుంటారని ఆయన తెలిపారు.

Similar News

News February 15, 2026

సింగరాయకొండ: డ్రోన్ల నిఘాలో బీచ్ ఫెస్టివల్

image

పాకల బీచ్ ఫెస్టివల్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

News February 14, 2026

సింగరాయకొండ శ్రీ చైతన్యలో విద్యార్థి మృతి

image

సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్లోని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి తెలియజేశారు. వెంటనే విద్యార్థిని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2026

కనిగిరిలో రోడ్డు ప్రమాదం.. 10th విద్యార్థి స్పాట్‌డెడ్.!

image

కనిగిరిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కనిగిరిలోని ఓ ప్రయివేటు స్కూల్‌లో 10th చదువుతున్న విద్యార్థులు 3 బైకులపై కనిగిరి రైల్వే స్టేషన్ చూసేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఓ బైక్‌కు ప్రమాదం జరగడంతో కుడుముల ప్రతీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అదే బైక్‌పై ఉన్న బెల్లంకొండ అనీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.