News February 19, 2025

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.

Similar News

News February 21, 2025

గ్రూప్-2 పరీక్షలకు 7 కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు 4,544 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని, ఏవైనా సందేహాలు ఉంటే 8801188046 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News February 21, 2025

భర్త పురుగుమందు తాగాడని పోలీసులకు ఫోన్

image

భర్త పురుగుమందు తాగాడంటూ ఓ మహిళ 100కు డయల్ చేసిన ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడులో చోటుచేసుకుంది. ధర్మవరం గ్రామానికి చెందిన బండి రోశయ్య పురుగుల మందు తాగానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పింది. పోలీసులు గాలించి రోశయ్యను మేదరమెట్ల బైపాస్ వద్ద గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను బెదిరించడానికి అలా చెప్పినట్లు రోశయ్య పోలీసులకు తెలిపాడు.

News February 21, 2025

ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆమె మాట్లాడుతూ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని, 42,439 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు.

error: Content is protected !!