News December 12, 2025

ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 12, 2025

ప్రకాశం జిల్లా TDP అధ్యక్ష పదవి.. ఛాన్స్ ఉగ్రాకేనా?

image

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇంకా భర్తీ కాని విషయం తెలిసిందే. కొన్ని నెలలక్రితం ఇక అధ్యక్ష పదవి భర్తీ అవుతుందని క్యాడర్ భావించినా TDP అధిష్ఠానం మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చినా, అధిష్ఠానం రాజకీయ సమీకరణాల ప్రకారం నిర్ణయం తీసుకోనుందట. తాజాగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి పేరు అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీ కామెంట్.

News December 12, 2025

ప్రకాశం: ఈనెల 13, 14న టీచర్లకు క్రీడలు.!

image

ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఈనెల 13, 14న ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్, మార్కాపురంలోని హైస్కూల్, కనిగిరిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో క్రీడలు జరుగుతాయన్నారు.

News December 12, 2025

ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష.!

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పునిచ్చారు. ఒంగోలుకు చెందిన నారాయణ మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2021లో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం న్యాయస్థానం నేడు నిందితుడికి శిక్ష విధించింది. పోలీసులను SP హర్షవర్ధన్ రాజు అభినందించారు.