News January 20, 2026
ప్రకాశం జిల్లాలో మద్యం లైసెన్స్‌కు దరఖాస్తులు

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగినవారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 9, 2026
మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2026
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.
News February 8, 2026
మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.


