News June 10, 2024
ప్రకాశం జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ప్రకాశం జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించింది. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.
Similar News
News November 1, 2025
దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News October 31, 2025
నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
News October 31, 2025
ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


