News March 30, 2024
ప్రకాశం జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి

మార్కాపురంలోని గాంధీ బజార్‌లో శనివారం భవనం పైనుంచి ప్రమాదవశాత్తు సచివాలయ ఉద్యోగి పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లయ్య (32) ఉదయం ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మిద్దెపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రగాయాలపాలై మల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News April 4, 2026
ఆరోగ్య సేవల్లో ప్రకాశం జిల్లాకు 16వ స్థానం

2026 ఫిబ్రవరిలో PHC పనితీరుకు ప్రభుత్వం ర్యాంకింగ్స్ విడుదలచేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ప్రకాశం జిల్లాకు 16వ స్థానం వచ్చింది. జిల్లాలో 39 PHCలు ఉండగా Aగ్రేడ్‌లో 3, B గ్రేడ్‌లో 22, C గ్రేడ్‌లో 11, D గ్రేడ్ 3 సాధించాయి. దీంతో పోలిస్తే ఆరోగ్య సేవల్లో ప్రకాశం జిల్లా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. OP, IP సేవలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న PHCల రికార్డుల ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.
News April 4, 2026
SP ఆదేశాలతో ఒంగోలులో ఆకస్మిక తనిఖీలు

ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులోని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్‌లు, మెటల్ డిటెక్టర్లతో రద్దీగా ఉండే ప్రాంతాలను శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ, ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.