News August 12, 2024
ప్రకాశం జిల్లాలో 1116 శివలింగాల ఆలయం ఇదే

జిల్లాలోని టంగుటూరు మండలం జమ్ములపాలెంలో 1116 శివలింగాలతో ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయంలోనూ 1116 శివలింగాలతో పాటు, ప్రతి శివలింగానికి నాగుల పడగ ఉండడం మరో విశేషం. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలో ఒక్కసారి శివనామస్మరణ చేస్తే 1116 సార్లు చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
Similar News
News February 16, 2026
ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 16, 2026
మార్కాపురం: 18 ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య.!

మార్కాపురం జిల్లా కంభంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకు మారట్లేదు. సకల జనుల సౌభాగ్యం అని నినాదాలు వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 18 ఏళ్ల క్రితం మార్కెట్ యార్డ్ వెనుక వైపు ST/SCలకోసం నిర్మించిన మదర్ థెరిస్సా కాలనీకి ఇప్పటికి కూడా కనీసం నడవడానికి సరైన దారిలేదు. తమ హయాంలో ఎంతో చేశామని చెప్పుకునే పాలకులకు ఇలాంటివి కనపడవా? అనేది ప్రశ్న.
News February 15, 2026
సింగరాయకొండ: డ్రోన్ల నిఘాలో బీచ్ ఫెస్టివల్

పాకల బీచ్ ఫెస్టివల్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.


