News August 14, 2025
ప్రకాశం జిల్లాలో 25 బార్ల ఏర్పాటు..!

ప్రకాశం జిల్లాలో నూతన బార్ పాలసీ అమలుపై ఎక్సైజ్ శాఖ అధికారులు సమీక్షించారు. జిల్లా జనాభా ప్రాతిపదికన 25 బార్లు నిర్వహించడానికి ప్రతిపాదన చేశారు. 50వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.35 లక్షలు, ఆపైన 5లక్షల లోపు జనాభా ఉన్న ఏరియాల్లో రూ.55 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. ఈ బార్లకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు.
Similar News
News August 14, 2025
ఒంగోలు సమీపంలో ఒకరి మృతి

ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని దిగువ లైన్ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్ రావు మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు నేరుగా తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
News August 14, 2025
దోర్నాలలో చిన్నారిపై చిరుత పులి దాడి

దోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన గూడెంలో ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిపై చిరుత పులి దాడి చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తమై కేకలు వేయడంతో పాపను విడిచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి సమయంలో చిరుత పులి పాపపై దాడి చేయడంతో తల, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు సున్నిపెంట వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
News August 14, 2025
ప్రకాశం జిల్లాలోని కంది సాగు రైతులకు శుభవార్త.!

ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధానంగా కంది సాగు చేసే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థితిలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం Way2Newsకు పలు విషయాలు వెల్లడించారు. సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 70 వేల హెక్టార్ల కంది సాగవుతుందన్నారు. ప్రస్తుతం 40 శాతం సబ్సిడీపై కంది విత్తనాలు ఇవ్వనున్నట్లు, రైతులు RSK కేంద్రాలను సంప్రదించాలన్నారు.