News May 12, 2024
ప్రకాశం జిల్లాలో 28 బార్లు, 178 మద్యం దుకాణాలు బంద్

జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయించినట్లు ఈఎస్ టి.శౌరి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 బార్లు, 178 మద్యం దుకాణాలను సీజ్ చేశామన్నారు. ఎన్నికలు అయ్యే వరకు మద్యం విక్రయాలు చేయకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో చర్యలు తీసుకున్నారు.
Similar News
News September 11, 2025
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా రాజ బాబు

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన తమీమ్ అన్సారియా తన మార్కు పాలన సాగించారు. పలు సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో ఆమె తనదైన శైలిని ప్రదర్శించారు.
News September 11, 2025
ఒంగోలు: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొమరోలు మండలం మైనర్ బాలిక పట్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించారు. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించగా పోలీసులను SP దామోదర్ అభినందించారు.
News September 10, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.