News September 28, 2024

ప్రకాశం జిల్లాలో 42,033 కౌలు రైతు కార్డులు జారీ

image

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద కౌలు రైతులకు 45వేల కార్డులను జారీ చేసేందుకు లక్ష్యంగా ఉంచుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 42,033 కార్డులను జారీ చేయడం జరిగిందని, కౌలు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు.

Similar News

News October 10, 2024

ప్రకాశం: విధులకు వస్తూ MRO మృతి

image

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.

News October 9, 2024

మార్కాపురం జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

News October 9, 2024

ఇండోర్ హాల్‌ను ప్రారంభించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలు పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌లోని పోలీసు జూడో క్లస్టర్‌లో తైక్వాండో, కరాటే, పెంచాక్ సిలాట్ గేమ్స్ కోసం, నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్‌డోర్ హాల్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. ఈ క్యాంప్‌కు వివిధ జిల్లాల నుంచి పోలీసు క్రీడాకారులు వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ నిమిత్తం కావాల్సిన వసతుల గురించి పోలీస్ క్రీడాకారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.