News December 11, 2024

ప్రకాశం జిల్లా జవాన్ ఎలా చనిపోయారంటే..?

image

ప్రకాశం జిల్లా కంభం మండలం <<14839505>>రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్<<>> వరికుంట్ల సుబ్బయ్య(43) జమ్మూలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పనిచేస్తున్న సుబ్బయ్య పూంచ్ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్నారు. ఈక్రమంలో పొరపాటున ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. తన ప్రాణం పోవడం ఖాయమని భావించారు. సహచర జవాన్లను ‘GO BACK’ అంటూ అలర్ట్ చేశారు. కాసేపటికే ల్యాండ్ మైన్‌ పేలడంతో వీర మరణం పొందారు.

Similar News

News January 7, 2026

మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News January 6, 2026

మార్కాపురం జిల్లాకు 59 మంది ఇన్‌ఛార్జ్ అధికారులు

image

మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన రోజు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన 59 మంది ఇన్‌ఛార్జ్ జిల్లా అధికారులను నియమించారు.