News February 20, 2025
ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

* మర్రిపూడిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ * వరల్డ్ ఛాంపియన్‌గా ప్రకాశం జిల్లా వ్యక్తి* ప్రకాశం జిల్లాలో బర్డ్ ప్లూ లేదు* రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్* వన్య ప్రాణుల ప్రాణాలకు విలువ లేదా?: ఎమ్మెల్యే తాటిపర్తి* 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: డీఆర్‌వో * వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్
Similar News
News February 21, 2025
చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం

చీమకుర్తి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏలూరివారి పాలెం – కూనంనేనివారి పాలెం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయాన్నే పనులకు వెళ్తున్న వారికి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పెద్ద ముగ్గు, మట్టి కుండలు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 21, 2025
గ్రూప్-2 పరీక్షలకు 7 కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు 4,544 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని, ఏవైనా సందేహాలు ఉంటే 8801188046 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News February 21, 2025
భర్త పురుగుమందు తాగాడని పోలీసులకు ఫోన్

భర్త పురుగుమందు తాగాడంటూ ఓ మహిళ 100కు డయల్ చేసిన ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడులో చోటుచేసుకుంది. ధర్మవరం గ్రామానికి చెందిన బండి రోశయ్య పురుగుల మందు తాగానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పింది. పోలీసులు గాలించి రోశయ్యను మేదరమెట్ల బైపాస్ వద్ద గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను బెదిరించడానికి అలా చెప్పినట్లు రోశయ్య పోలీసులకు తెలిపాడు.