News February 22, 2025
ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

☛ కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ ☛ శ్రీశైలం యాత్రకు 24 గంటలు అనుమతి ☛ ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్ ☛ ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించాలి: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ☛ భర్త పురుగు మందు తాగాడని పోలీసులకు ఫోన్☛ గ్రూప్ – 2 పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ ☛ చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం ☛ గ్రూప్-2 మెయిన్స్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
Similar News
News December 29, 2025
మార్కాపురం సరికొత్త జిల్లాలో.. మండలాలు ఇవేనా?

మార్కాపురం జిల్లాకు కొత్త ఏడాదిలో ముహూర్తం ఖరారైంది. గతంలో 21 మండలాలతో ఆమోదం తెలపగా.. దొనకొండ, కురిచేడు మండలాలను కలిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వైపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పి.చెరువు, దోర్నాల, పెద్దారవీడు, హెచ్.యం పాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్పురం, పామూరు, కంభం, అర్ధవీడు, కంభం, బి.పేట, దొనకొండ, కురిచేడు మండలాలు ఉండనున్నాయి.
News December 29, 2025
ప్రజల్లో విశ్వాసం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణతోపాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించాలన్నారు.
News December 29, 2025
ప్రకాశం: నేటి కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.


