News November 12, 2024
ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు రూ.444.15 కోట్లు
అసెంబ్లీలో నిన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.394 కోట్లు కేటాయించారు. అలాగే గుండ్లకమ్మకు సైతం రూ.13 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. మొత్తం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి ఎన్డీఏ ప్రభుత్వం రూ.444.15 కోట్లు కేటాయించిందని.. గత ప్రభుత్వం రూ.168.92 కోట్లనే బడ్జెట్‌లో ప్రతిపాదించిందని కూటమి నేతలు అన్నారు.
Similar News
News November 20, 2024
అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టక తప్పదని మంత్రి స్వామి అన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
News November 20, 2024
శాసనమండలిలో మంత్రి గొట్టిపాటి ఫైర్
శానసమండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు.అవగాహన, ముందు చూపు లేని సీఎం వల్ల విద్యుత్ శాఖలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, పెరగనున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అడుగులేస్తోందన్నారు.
News November 20, 2024
మర్రిపూడి: భార్య అంత్యక్రియలు చేసిన కాసేపటికి భర్త మృతి
మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లెలో విషాదకర ఘటన జరిగింది. భార్య తిరుపాలమ్మ(75) అంత్యక్రియలు ముగిసిన కాసేపటికి దిబ్బారెడ్డి (85) మృతి చెందాడు. భార్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మృతి చెందగా.. మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. స్మశాన వాటిక నుంచి ఇంటి కొచ్చిన కాసేపటి దిబ్బారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.