News September 9, 2025
ప్రకాశం జిల్లా మాజీ MLA ఇంట్లో చోరీ.!

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో మాజీ MLA సుధాకర్ బాబు ఇంట్లో దుండగులు శనివారం రాత్రి చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. మద్దిపాడు SI వెంకట్ చోరీ జరిగిన తీరును సోమవారం పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో వేలిముద్రల సేకరణకు తనిఖీలు నిర్వహించారు. దుండగులు మాజీ MLA ఇంటి డోర్ లాక్‌ను మాత్రమే పెకిలించారని, అన్నీ వస్తువులు భద్రంగా ఉన్నాయని SI తెలిపారు.
Similar News
News September 9, 2025
ప్రకాశం: బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో MDR సమావేశం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ 3 నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందింది. ఆమె మృతిపై విచారణ చేసి నివేదిక అందజేయాలన్నారు.
News September 9, 2025
వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయం: కలెక్టర్

ఒంగోలు నగర కార్పోరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో చొరవ తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు వ్యర్థాల నిర్వహణపై ఎంఓయూ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.
News September 9, 2025
నేడు ప్రకాశం జిల్లాలో అన్నదాత పోరు.!

ప్రకాశం జిల్లాలో అన్నదాత పోరును నేడు నిర్వహిస్తున్నట్లు YCP ప్రకటించింది. యూరియా కొరత ఉందంటూ వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఇటీవల ఎరువుల షాపులపై విస్తృత తనిఖీలు సాగాయి. కాగా YCP నిరసనకు పిలుపునివ్వగా, 30 యాక్ట్ అమలులో ఉందని పలుచోట్ల పోలీసులు ప్రకటన విడుదల చేశారు.