News December 25, 2025

ప్రకాశం జిల్లా మెప్మా పీడీపై చర్యలు

image

ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతోంది. విచారణ పర్వంలోనే పీడీని సరెండర్ చేయడం విశేషం.

Similar News

News December 28, 2025

రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

image

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.

News December 28, 2025

ప్రకాశం జిల్లాకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల

image

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల వచ్చారు. తన తాత స్వగ్రామమైన కెల్లంపల్లిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాత నివాసానికి వెళ్లి శ్రీలీల కొంతసేపు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సినీ నటి శ్రీలీల గ్రామానికి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.

News December 28, 2025

ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఈయనే.!

image

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా షేక్ నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా బాసం శేషారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.