News September 21, 2024

ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 17, 2026

ప్రకాశం: ‘చిన్నారి మృతి.. విచారణలో జాప్యమెందుకు’

image

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్‌ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్‌పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.

News February 17, 2026

GNT-గుంతకల్లు ట్రాక్.. గాజులపల్లి టన్నెల్ పూర్తి

image

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్‌) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.

News February 17, 2026

బీచ్ ఫెస్ట్ సక్సెస్.. పోలీసులను అభినందించిన SP

image

పాకల బీచ్ ఫెస్టివల్‌లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.