News March 29, 2025
ప్రకాశం జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన CM

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్లలో శనివారం శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కాటమరాజు కరుణతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో సిరిసంపదలతో కలకాలం ఉండాలని, ఆకాంక్షిస్తున్నట్లు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Similar News
News April 1, 2025
ప్రకాశం: నేడు సోషల్ పరీక్ష

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షకు హాజరు కాగలరన్నారు.
News March 31, 2025
ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.