News September 21, 2025

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు సూచన

image

ప్రకాశం జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ SE వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను జిల్లా వ్యాప్తంగా చెల్లించే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న విద్యుత్ బిల్లుల కౌంటర్లను వినియోగదారులు సంప్రదించి విద్యుత్ బిల్లును చెల్లించాలని కోరారు.

Similar News

News September 21, 2025

కొండపిలో పొగాకు ధరలు పతనం

image

కొండపి పొగాకు వేలం కేంద్రంలో లోగ్రేడ్ ధరలు రైతులకు షాక్ ఇస్తున్నాయి. వేలం ప్రారంభంలో కేజీ రూ.250గా ఉన్న లోగ్రేడ్ పొగాకు 12వ రౌండ్ చివరకు రూ.100కి పడిపోయింది. లో గ్రేడ్ బేళ్ల తిరస్కరణ సంఖ్య సైతం ఎక్కువగా ఉంటోంది. వేలం ముగింపు దశలోనూ బేళ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

News September 21, 2025

టంగుటూరు: 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకు సీజ్

image

విజిలెన్స్ అధికారి హేమంత్ కుమార్ శనివారం తెల్లవారుజామున 16 లక్షల విలువైన 80 క్వింటాళ్ల లోగ్రేడ్ పొగాకును అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. పొదిలి నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులు తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News September 21, 2025

ప్రకాశం జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా.!

image

ప్రకాశం జిల్లాలో 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. ఎక్కడ ఎంత వర్షపాతం(మిల్లీ మీటర్లలో) నమోదైందంటే..
➤హనుమంతునిపాడు: 69 ➤తాళ్లూరు:66 ➤తర్లపాడు: 64.2
➤పుల్లలచెరువు-60.4 ➤దర్శి-46.2 ➤ టంగుటూరు: 46.2
➤త్రిపురాంతకం-39.4 ➤పెద్దారవీడు-38.6➤ కనిగిరి-34
➤మర్రిపూడి-32.8 ➤జరుగుమల్లి: 32.4
➤ చీమకుర్తి-45 ➤ఒంగోలు: 30.6