News February 23, 2025
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

➤ప్రకాశం: గ్రూప్-2 మెయిన్స్‌కు 3965 మంది<<15556959>> హాజరు<<>>
➤ కంభం వద్ద రోడ్డు <<15557637>>ప్రమాదం.!<<>>
➤సంతనూతలపాడులో 25న మెగా <<15556030>>జాబ్ మేళా.!<<>>
➤పవన్ కళ్యాణ్‌పై MLA తాటిపర్తి సెటైరికల్ <<15555651>>ట్వీట్<<>>
➤ఫేక్ వార్తలపై <<15555300>>ఉక్కుపాదం<<>>: ప్రకాశం కలెక్టర్
➤దర్శిలో చికెన్‌పై ఆఫర్.. కిలో రూ.99
➤కనిగిరిలో ముగ్గురి అరెస్ట్
Similar News
News February 23, 2025
ప్రకాశం: గ్రూప్- 2 మెయిన్స్‌కు 579 మంది గైర్హాజరు.!

ప్రకాశం జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టరేట్ ప్రకటించింది. పేపర్- 1కు మొత్తం 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 3968 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 576 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలాగే పేపర్- 2 పరీక్షకు 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 3965 మంది హాజరయ్యారు. 579 మంది గైర్హాజరయ్యారు.
News February 23, 2025
పవన్ కళ్యాణ్‌పై ప్రకాశం జిల్లా MLA సెటైరికల్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.”సనాతనం నిన్ను కాపాడదు సైన్స్ మాత్రమే కాపాడుతుందన్నారు.’’ ఆధునిక వైద్యమే కాపాడుతుందని చెప్పకపోయినా సరే, అది నిన్ను కాపాడుతుందన్నారు. అదే అభ్యుదయపు గొప్పదనమని తెలిపారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు MLA తాటిపర్తి Xలో రాసుకొచ్చారు.
News February 23, 2025
కొండపి: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, అన్న గతేడాది క్రిస్మస్‌కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది. విషయం తల్లికి చెప్పడంతో కేసు పెట్టింది.