News March 24, 2024
ప్రకాశం: టీడీపీలోకి మాజీమంత్రి శిద్దా?

టీడీపీలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. మరి ఈయన పార్టీలో చేరితే పొత్తులో భాగంగా సీటు వస్తుందో రాదో చూడాలి.
Similar News
News September 3, 2025
ప్రకాశం: డబ్బులు చెల్లించండి.. కొత్త రుణాలు ఇస్తాం.!

ప్రకాశం జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు వారి బకాయిలను త్వరితగతిన చెల్లించాలని సంబంధిత శాఖాధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో జిల్లాలో 833 యూనిట్లకు గాను రూ.24.18 కోట్ల బకాయిలు ఉన్నట్లు, పాత బకాయిలను చెల్లించకపోవడంతో కొత్త రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 364 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
News September 3, 2025
ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News September 3, 2025
త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్‌వీల్ వ్యాన్- బైక్ ఒకదానికొకటి ఢీకొని ఓ మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.