News October 24, 2024
ప్రకాశం: టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

ప్రకాశం జిల్లాలో మరో నేత YCPకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సచివాలయంలో బుధవారం చీరాల మాజీ MLA కరణం బలరాం CM చంద్రబాబును కలిశారు. ఆయనతో పాటు MLA దామచర్ల ఉన్నారు. ఈయన 2019లో చీరాల నుంచి TDP తరఫున MLAగా గెలిచి YCPలో చేరారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేశ్ YCP నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బలరాం కలవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News December 14, 2025
ప్రకాశం: గ్యాస్‌పై ఎక్కువ వసూలు చేస్తే.. నోటీసులే.!

సిలిండర్ డెలివరీకి అధికంగా పైసలు వసూలు చేస్తే IVRSకు పట్టుబడే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రభుత్వం తమ సేవల గురించి ప్రతి వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ చేస్తుంది. ఈ విధంగానే గ్యాస్ వినియోగదారులకు కూడా కాల్స్ ద్వారా డెలివరీ సమయంలో ఇబ్బందులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. వినియోగదారులు నేరుగా పలు గ్యాస్ ఏజెన్సీలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో దీనిపై ఆ ఏజెన్సీలకు అధికారులు నోటీసులిచ్చారు.
News December 14, 2025
ప్రకాశం: కొద్ది దూరమే కదా అనుకుంటే.. ప్రాణానికే ప్రమాదం

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరంకంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు. కాదని అతిక్రమిస్తే కఠిన చర్యలు, జరిమానాలు విధిస్తామన్నారు.
News December 14, 2025
ప్రకాశం:10th విద్యార్థులకోసం ఇలా..!

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి విద్యార్థులపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఒంగోలు డిప్యూటీ డిఈఓ చంద్రమౌళీశ్వర్ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు నియోజకవర్గాల హెచ్ఎం, ఎంఈఓలకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు 100% పాస్ అయ్యేలా లక్ష్యాన్ని ఎంచుకొని, ప్లాన్ అమలు చేయాలన్నారు.


