News March 29, 2024
ప్రకాశం టీడీపీలో ముగ్గురు డాక్టర్లు పోటీ
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జిల్లాలో ముగ్గురు డాక్టర్లు పోటీ చేస్తున్నారు. ముగ్గురు పూర్తిగా వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు సేవలందించారు. కొండపిలో బాలవీరాంజనేయస్వామి ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ 2009 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే కనిగిరిలో కాంగ్రెస్ తరఫున ఉగ్రనరసింహారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా దర్శి నుంచి వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు.
Similar News
News November 17, 2024
ఒంగోలు పోలీస్ స్పోర్ట్స్ మీట్లో గేమ్‌ల వివరాలు ఇవే
ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు వాలీ బాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌తోపాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో, మహిళలకు వాలీ బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలతోపాటు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారు.
News November 16, 2024
ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరంటే..?
ఒంగోలు మాజీ MLA బాలినేని శ్రీనివాసరెడ్డి YCPని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చుండూరి రవిబాబును YCP ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. దీంతో ఆయన నేపథ్యం ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. సీనియర్ NTరామారావు హయాంలో టీడీపీలోకి ప్రవేశించారు. 2004, 2009లో TDP టికెట్ ఆశించినా రాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపుతో YCPలో చేరారు. ఇతని స్వస్థలం నాగులుప్పలపాడు మండలం.
News November 16, 2024
మాజీ MLA టీజేఆర్కు కీలక బాధ్యతలు
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు సంతనూతలపాడు మాజీ MLA టీజేఆర్ సుదాకర్ బాబు, వెంకట రమణా రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.