News December 9, 2025
ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News January 27, 2026
ఉమ్మడి ప్రకాశం: గురుకులాల్లో ప్రవేశాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జయ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు, అలాగే దరఖాస్తు చేసుకునేందుకు http://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అర్హులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News January 27, 2026
కనిగిరి మీదుగా రైలు.. 30న ట్రయల్ రన్.!

కనిగిరి ప్రాంత వాసుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనిగిరి రైల్వే స్టేషన్‌కు పలుమార్లు గూడ్స్ రైళ్లు రైల్వే సామాగ్రీ తీసుకొచ్చాయి. 30న ట్రయల్ రన్ వేయనున్నారు. కనిగిరి- శంకవరం క్వారీల మధ ట్రాక్ ఏర్పాటుకు కొన్ని ఇబ్బందులు రాగా చివరికి గ్రీన్ సిగ్నల్ పడింది. స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో హైవే ఏర్పాటు కావడం గమనార్హం.
News January 26, 2026
ప్రకాశం జిల్లాలో 104 పోస్టులకు 5వేలమంది పోటీ

ప్రకాశం జిల్లాలోని KGVBల్లో 104 నాన్ టీచింగ్ పోస్టులకు 5,018 దరఖాస్తులు వచ్చాయి. పీజీ చదివిన వాళ్లు సైతం వీటికి అప్లై చేశారు. అటెండర్ పోస్టుకు 511 మంది, వాచ్‌మెన్ పోస్టుకు 246మంది, 12 వార్డెన్ పోస్టులకు 589 మంది, 9 పార్ట్‌టైం టీచర్ పోస్టులకు 234మంది దరఖాస్తు చేసుకున్నారు. 12 కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు 1,124మంది, 11 హెడ్ కుక్ ఉద్యోగాలకు 356మంది అప్లై చేయడం విశేషం.


