News June 16, 2024

ప్రకాశం: తండ్రి కోసం విగ్రహం కట్టించిన కుమారులు

image

కన్న తండ్రికి కుమారులు ఏకంగా గుడి కట్టిన ఘటన సీఎస్‌పురం మండలం కొండ్రాజుపల్లిలో జరిగింది. మట్లే బోడెయ్య, కొండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. బోడెయ్య వ్యవసాయం చేసి కుమారులను చదివించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు మాలకొండలరావు రైల్వేలో, చిన్న కుమారుడు సచివాలయంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో బోడెయ్య మృతి చెందగా.. కుమారులిద్దరు తమ పొలంలో బోడెయ్యకు గుర్తుగా గుడి కట్టి ఆయన విగ్రహాన్ని అందులో ఉంచారు.

Similar News

News October 3, 2024

ఒంగోలు: నేటి నుంచి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

image

ఒంగోలులోని కొండమీద వెలసిన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.

News October 2, 2024

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

image

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో CM చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.

News October 2, 2024

అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.