News April 9, 2025

ప్రకాశం: తల్లికి పునర్జన్మనిచ్చి కుమారుడి మృతి

image

మద్యం మత్తులో భర్త భార్యను పొడవబోయిన కత్తికి కుమారుడు బలయ్యాడు. దీంతో తల్లికి పునర్జన్మనిచ్చి కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అర్ధవీడుకు చెందిన షేక్. ఖాసిం వలి తరచూ మద్యం తాగి ఇంటి వద్ద భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా గొడవ పడుతూ కత్తితో తన భార్యను పొడవబోగా కుమారుడు షాకీర్ అడ్డు రావటంతో కత్తిపోటుకు గురై మృతి చెందాడు.

Similar News

News April 17, 2025

ఒంగోలు: బ్రోచర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్), శక్తి యాప్‌లపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన మిత్ర శక్తి యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్రోచర్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2025

గిద్దలూరు: తాటి చెట్టు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి

image

తాటి చెట్టు పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. దిగువమెట్టకు చెందిన సిరివల్ల రామచంద్రుడు (42) తాటి చెట్టు ఎక్కి తాటి నుంజలు కోస్తూ ఉండగా జారి కింద పడటంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

News April 17, 2025

ప్రకాశం: జిల్లాకు 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు

image

స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం మొదటిసారిగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్పెషల్ బీఈడీ కోర్సులు చేసిన అభ్యర్థులను టీచర్లుగా నియమించనుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!