News September 20, 2025
ప్రకాశం: దివాలీ బాణసంచా లైసెన్స్ ఇలా.!

దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా విక్రయించేందుకు ఆసక్తిగల వ్యాపారుల నుంచి లైసెన్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు DRO ఓబులేసు తెలిపారు. ఒంగోలులోని డీఆర్వో కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈనెల 21 నుంచి వచ్చేనెల ఐదులోగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీపావళి బాణసంచాను అక్రమంగా తయారు చేయడం, నిల్వ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
Similar News
News September 29, 2025
కనిగిరిలో కలెక్టర్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు సోమవారం కనిగిరిలో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమం జరిగే పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాలును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆరు మండలాల నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
News September 28, 2025
బిజీ బిజీగా ప్రకాశం పోలీస్ డ్రోన్స్.!

ప్రకాశం జిల్లా పోలీసులు వినియోగిస్తున్న పోలీస్ డ్రోన్స్ బిజీబిజీగా మారాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పగలు, రాత్రి తేడా లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు డ్రోన్లతో విజిబుల్ పోలీసింగ్ విస్తృతంగా సాగిస్తున్నారు. ప్రధానంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించేందుకు పోలీస్ డ్రోన్స్ అహర్నిశలు శ్రమిస్తున్నాయి. దీంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని పలువురి అభిప్రాయం.
News September 28, 2025
గిద్దలూరు: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. పోలీసుల హెచ్చరిక

గిద్దలూరులోని కొండపేట వాగు వద్ద అర్బన్ స్థానిక పోలీసులు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నీటి గుండాలు ఏర్పడుతున్నాయని, పిల్లలు ఎవరు ఈతకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.