News January 6, 2025

ప్రకాశం: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.

Similar News

News January 7, 2025

సంతమాగులూరు: Way2News కథనానికి స్పందించిన మంత్రి లోకేశ్

image

సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఈనెల రెండో తేదీన రోడ్డు ప్రమాదం జరిగి బాలుడికి గాయాలయ్యాయి. ఈ కథనం <<15047387>>Way2News<<>>లో ప్రచురితమైంది. ఈ వార్తకు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ట్విటర్(X) వేదికగా స్పందించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన బృందం దానిని పరిశీలించి, సాధ్యమైన సహాయం బాలుడికి చేస్తుందని ట్వీట్ చేశారు.

News January 7, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు భయపడకండి: DMHO

image

బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

News January 7, 2025

ప్రకాశం: భయపడుతున్న ఫేక్ లబ్ధిదారులు..!

image

ఉమ్మడి ప్రకాశంలో జిల్లాలోని ఫేక్ పెన్షన్లపై అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో కొందరిలో టెన్షన్ నెలకొంది. కొండపి మండలంలో నకిలీ వికలాంగుల పెన్షన్‌దారులను గుర్తించేందుకు ఎంపీడీఓ నేతృత్వంలో డాక్టర్లు పర్యటించారు. వీరి రాకను గమనించిన కొందరు నకిలీ పెన్షన్‌దారులు ఇళ్లకు తాళాలువేసి ఊరెళ్లారని తెలుస్తోంది. మరికొందరు కనిపించకుండా పరారయ్యారని సమాచారం.