News October 9, 2025

ప్రకాశం: నర్సింగ్ జాబ్స్ కావాలా..ఈ ఛాన్స్ మిస్ కావద్దు.!

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం నర్సింగ్ చదివిన అభ్యర్థులకు హోం కేర్ నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంబంధిత కార్పొరేషన్ ఈడీ హైఫా తెలిపారు. ప్రకాశం జిల్లాలో మైనారిటీస్ అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్లో ఈ నెల 12 లోగా దరఖాస్తు చేయాలన్నారు. ఎంపికైన వారు ఖతార్, దోహాలలో పని చేయాలన్నారు. వివరాలకు ఒంగోలు స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

Similar News

News October 9, 2025

త్రిపురాంతకం వద్ద యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

త్రిపురాంతకంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడపి సమీపంలోని మానేపల్లి రహదారిలో ద్విచక్ర వాహనం – బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 8, 2025

ప్రకాశం: ‘రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

image

రెవెన్యూ అంశాల ప్రజా సేవల పనితీరుపట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లకు సూచించారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి కలెక్టర్ రాజాబాబు హాజరై జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని వివరించారు.

News October 8, 2025

పొదిలి: షాప్‌లోకి దూసుకెళ్లిన కారు.!

image

పొదిలి పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారులో ఓవర్ స్పీడ్‌తో వచ్చి క్లోజ్ చేసిన హోటల్లోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.