News December 4, 2024
ప్రకాశం: నాలుగేళ్ల క్రితం భర్త.. ఇప్పుడు కుమారుడు మృతి
నాలుగేళ్ల క్రితం భర్త అకాల మరణంతో కుటుంబ పోషిన్తున్న తల్లి లక్ష్మీకి విధి కడుపు కోత మిగిల్చింది. గారభంగా పెంచుకున్న కుమారుడిని సోమవారం పాముకాటు వేయడంతో మరణించాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలోని బురుజుపల్లె గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిద్రిస్తున్న మనోజ్ తలపై పాము కాటు వేసింది. బాలుడు అరవడంతో తల్లి పామును దూరంగా విసిరేసింది. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మరణించాడు.
Similar News
News December 4, 2024
నేడు రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య వర్ధంతి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం, రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య మరణించి నేటికీ 3 ఏళ్లు పూర్తయ్యాయి. చీరాల MLAగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోశయ్య అసెంబ్లీలో వరుసగా 7సార్లు, మొత్తం 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఆయన తమిళనాడు కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయన ఒక్కడికే సొంతం.
News December 4, 2024
మార్కాపురం: అమ్మను రోడ్డుపై వదిలేశారు
బతుకుదెరువు కష్టంగా మారి అనాథగా మిగిలిన పి.కాంతమ్మ అనే వృద్ధ మహిళను మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి ఆశ్రమంలో చేర్పించారు. మార్కాపురానికి వృద్ధురాలిని కుమారుడు, బంధువులు బాగోగులు చూడకుండా వదిలేశారు. విషయం కలెక్టర్ తమీమ్ అన్సారియా దృష్టికి వెళ్లింది. దీంతో మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి కనిగిరి ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి అక్కడ ఉండేలా ఆమెకు ఏర్పాట్లు చేశారు.
News December 4, 2024
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట: ప్రకాశం కలెక్టర్
దివ్యాంగుల సంక్షేమానికి, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు, వారికి అవసరమైన రంగాలలో శిక్షణ ఇవ్వటంతోపాటు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.