News December 16, 2025

ప్రకాశం: పరారైన ఖైదీ.. 24 గంటల్లో పట్టుబడ్డాడు

image

ఒంగోలు బస్టాండ్ నుంచి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారైన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జైలు నుంచి వైజాగ్‌కు ఇరువురు నిందితులను తీసుకువెళ్తుండగా ఒంగోలు బస్టాండ్ వద్దకు ఆదివారం రాత్రి ఎస్కార్ట్ పోలీసులు చేరుకున్నారు. అక్కడ వారి కళ్లుగప్పి శ్రీనివాసరావు అనే నిందితుడు పారిపోయాడు. కాగా ఒంగోలు వన్‌టౌన్ PSలో ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 25, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వైద్య పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో చిన్నారుల ఆరోగ్యానికి మరోసారి ఇచ్చేందుకు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సైతం జిల్లా వ్యాప్తంగా DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు 4,04,091 మంది ఉండగా, బాల్యంలో వ్యాధులు ఉన్నవారిగా 314 మందిగా అధికారులు గుర్తించారు.

News December 25, 2025

విద్యుత్ కాంతులతో మెరుస్తున్న మార్కాపురం చర్చి

image

క్రీస్తు జననాన్ని గుర్తుచేసుకుంటూ క్రైస్తవులు Nov 25 నుంచి Dec 25 వరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కాంతులతో మార్కాపురం తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి మిలమిల మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. బుధవారం రాత్రి మెగా క్రిస్మస్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్యారల్స్‌లో ఉత్సాహంగా పాటలు పాడుతూ సందడి చేశారు.