News November 19, 2024
ప్రకాశం: పాఠశాలల పని వేళల్లో మార్పు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 38 ఉన్నత పాఠశాలల్లో పనివేళలు మారుస్తూ DEO ఎ.కిరణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఓ ఉన్నత పాఠశాల చొప్పున 38 పాఠశాలలను సెలెక్ట్ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పని వేళలు పొడిగించారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాఠశాలల టైమింగ్ మారిన విషయం తెలిసిందే.
Similar News
News September 14, 2025
ప్రకాశం లోక్ అదాలత్‌లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
News September 14, 2025
ప్రకాశం కొత్త కలెక్టర్ ముందు సవాళ్లు ఇవేనా..!

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత కలెక్టర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేసిన ప్రభుత్వం, జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంలో రాజాబాబును ప్రభుత్వం గుర్తించి మరీ భాద్యతలు అప్పగించింది. అయితే నూతన కలెక్టర్ ముందు తొలుత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, వెలుగొండ పూర్తి, భూ సమస్యలు సవాళ్లుగా నిలవనున్నాయి.
News September 14, 2025
24 గంటలు అందుబాటులో ఉంటా: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి, ప్రజలకు ప్రభుత్వ సేవలు దగ్గరికి చేరవేస్తానని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం బాధ్యతల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో తనవంతు కీలకపాత్ర పోషిస్తానన్నారు. అలాగే భూ సమస్యలు, రెవెన్యూపరమైన ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు నూతన కలెక్టర్ తెలిపారు.