News March 22, 2024

ప్రకాశం: పెండింగ్‌లో రెండు సీట్లు

image

ఇవాళ టీడీపీ మూడో జాబితాలో చీరాల టికెట్‌ను కొండయ్యకు కేటాయించింది. ఇక దర్శి ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ స్థానాలు పెండింగ్‌లో ఉంచాయి. దర్శి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గరికపాటి వెంకట్‌కు కేటాయిస్తారని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఇస్తారని టాక్.

Similar News

News September 3, 2025

ప్రకాశం: డబ్బులు చెల్లించండి.. కొత్త రుణాలు ఇస్తాం.!

image

ప్రకాశం జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు వారి బకాయిలను త్వరితగతిన చెల్లించాలని సంబంధిత శాఖాధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో జిల్లాలో 833 యూనిట్లకు గాను రూ.24.18 కోట్ల బకాయిలు ఉన్నట్లు, పాత బకాయిలను చెల్లించకపోవడంతో కొత్త రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 364 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

News September 3, 2025

ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News September 3, 2025

త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్‌వీల్ వ్యాన్- బైక్ ఒకదానికొకటి ఢీకొని ఓ మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.