News June 25, 2024
ప్రకాశం: పెరిగిన ధరతో లబ్ధి ఎంతంటే..

జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నాయి. అందులో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎకరాకు సగటున 1,900 కిలోల వరి దిగుబడి లభిస్తుంది. రూ.117 అదనపు ధర లభించడంతో వరి రైతులకు రూ.95కోట్లు అదనంగా సమకూరనుంది. మొక్కజొన్న మీద క్వింటాకు రూ.135 పెరగడంతో అదనంగా రూ.3,750 లాభం రానుంది. పత్తిపై అదనంగా క్వింటాకు రూ.501 పెంచడంతో అదనంగా రూ.6వేల వరకు లాభం చేకూరనుంది.
Similar News
News November 6, 2025
అధికారులకు ప్రకాశం కలెక్టర్ సూచనలు

లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటినుంచే దృష్టిసారించాలని ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఈఆర్వోలను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు నుంచి కలెక్టర్ హాజరయ్యారు.
News November 6, 2025
ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.


