News December 28, 2024
ప్రకాశం: పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారా?.
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈనెల 30న ప్రారంభమై జనవరి 10 వరకు జరగనున్నాయి. మొత్తం 5,345 మంది హాజరు కానుండగా.. అందులో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా డబ్బు కడితే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేస్తారని SP అన్నారు. ఎవరైనా ఇలా నగదు వసూలుకు పాల్పడితే 9121102266కు కాల్ చేయాలన్నారు.
Similar News
News December 29, 2024
పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ సమావేశం
ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పీఎం సూర్యఘర్ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 5వేలకు పైగా జనాభా ఉండి, సౌర విద్యుత్ వినియోగించే గ్రామాలను గుర్తించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News December 28, 2024
ఒంగోలు: ఆరు నెలల్లో 367 మంది క్షేమంగా ఇళ్లకు.!
జిల్లాలో గత ఆరు నెలల్లో 367 మంది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైన వారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్పీ దామోదర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఉన్నట్లు చెప్పారు. అలా 367 మందిని గుర్తించి తీసుకొచ్చామన్నారు.
News December 28, 2024
పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: ఎస్పీ
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ – 2025ని శనివారం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, నాగరాజు పాల్గొన్నారు.