News August 8, 2024
ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలల నూతన కమిటీ ఎన్నికలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 1830, ప్రాథమికోన్నత పాఠశాలలు 213, ఉన్నత పాఠశాలలు 298, మొత్తం 2341 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలకు నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించటానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులే ఓటర్లుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు DEO తెలిపారు.
Similar News
News February 20, 2026
CM వెలిగొండ పర్యటనపై కీలక సమావేశం

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాజెక్ట్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అలాగే ఎల్లుండి సీఎంతో సమావేశం నేపథ్యంలో వివరించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు.
News February 20, 2026
ఉమ్మడి ప్రకాశం: కీలక సమావేశానికి రంగం సిద్ధం.!

ఈ నెల 22న అమరావతిలో CM చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇన్‌ఛార్జ్‌లు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిని విడివిడిగా సమీక్షిస్తూ, అభివృద్ధిలో వేగం పెంచేందుకు CM దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
News February 20, 2026
కంభంలో ACB దాడులు.. లంచం తీసుకుంటూ చిక్కిన అధికారి

మార్కాపురం జిల్లా కంభంలో శుక్రవారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పురుగు మందుల షాపు లైసెన్స్ మంజూరు కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారి లంచం డిమాండ్ చేశాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కంభం మండల వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


