News January 12, 2025

ప్రకాశం: బంపర్ ఆఫర్.. ఉచిత రీచార్జ్ అని మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు కనిగిరి పోలీసులు గుర్తించారు. పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉచిత రీఛార్జ్ ఇస్తున్నారంటూ ప్రకాశం జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపులలో ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో నగదు కోల్పోయే ప్రమాదం ఉందని శవివారం కనిగిరి పోలీసులు హెచ్చరించారు.

Similar News

News October 29, 2025

ఒంగోలు: హైవేపైకి నీరు.. రాకపోకలకు అంతరాయం

image

భారీ వర్షాలకు గుండ్లకమ్మ డ్యాం నిండింది. జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం 16 గేట్లు ఉండగా అధికారులు 15 గేట్లు ఎత్తి 1.50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మద్దిరాలపాడు సమీపంలో హైవే బ్రిడ్జిపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. NDRF సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

News October 28, 2025

ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

image

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్‌లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.