News September 28, 2024

ప్రకాశం: ‘బాణసంచా తయారీలపై నిఘా ఉంచాలి’

image

రాబోవు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని, పోలీసు అధికారులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అనధికారికంగా బాణసంచా తయారీ, నిల్వలు, రవాణా వంటి వాటిని నియంత్రించి ముందస్తు ప్రమాదాలను నిలువరించే దిశగా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 24, 2025

తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

image

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, వాటిని తిరుమలకు తీసుకొచ్చిన భక్తులపైనా కేసులు నమోదు చేస్తాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.

News December 24, 2025

ప్రకాశంలో మాతా శిశు మరణాల.. పరిస్థితి ఇదే!

image

ప్రకాశంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది మాతా శిశు మరణాల తగ్గాయని చెప్పవచ్చు. 2019-20లో 16 మాతృ మరణాలు, 359 శిశు మరణాలు, 2020-21లో 19 మాతృ, 263 శిశు, 2021-22లో 20 మాతృ, 403 శిశు, 2022-23లో 5 మాతృ, 201 శిశు, 2023-24లో 8 మాతృ, 196 శిశు, 2024-25లో 5 మాతృ, 177 శిశు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4 మాతృ, 121 శిశు మరణాలు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మాతా శిశు మరణాల తగ్గుముఖం పట్టాయి.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.