News October 19, 2024

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

image

ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది. సాగర్‌ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటు పెరిగింది. దీంతో 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 84,297 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.

Similar News

News November 6, 2025

మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం 7 నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సభా వ్యవహారాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని DEO వివరించారు.

News November 6, 2025

పంట నష్టం నమోదు పారదర్శంగా జరుగుతుంది: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవికావని కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం లెక్కింపు కార్యక్రమం గత 7 రోజులుగా అధికారుల సమక్షంలో నిరంతరంగా పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.

News November 6, 2025

కృష్ణా: మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులు వీరే.!

image

రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం ఏడు నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎస్. వాగ్దేవి (8వ తరగతి), పెడన- పి. చాందిని 10th, ఉయ్యూరు-ఉప్పాల అక్షయ 10th, గుడివాడ-వి.అక్షిత 10th, గన్నవరం-పి.చరిత 10th, పామర్రు-పాముల హిమబిందు 10th, అవనిగడ్డ-హిమాంజలి 9th. ఎంపికయ్యారు.