News July 10, 2025
ప్రకాశం బ్యారేజ్‌కి వరద

ప్రకాశం బ్యారేజీ వద్దకు బుధవారం సాయంత్రం నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారిక లెక్కల ప్రకారం బుధవారం 1,47,939 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో పవర్ హౌస్ ద్వారా 67,233 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 80,646 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 1.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు
Similar News
News July 10, 2025
చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన ‘టో ఫిష్’ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక ‘టో ఫిష్’ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు. కాగా సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు.
News July 10, 2025
మరో 6 దేశాలకు టారిఫ్స్ ప్రకటించిన ట్రంప్

అధిక సుంకాల విధింపు గడువును US అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటికల్లా ఒప్పందాలు చేసుకోకపోతే అమెరికాకు ఎగుమతులపై పెంచిన టారిఫ్స్ కట్టాలి. రెండ్రోజుల క్రితం 14 దేశాలకు ఈ టారిఫ్స్ వివరాలతో లేఖలు పంపారు. ఇప్పుడు మరో ఆరు దేశాలకు ట్రంప్ కొత్త టారిఫ్స్ ప్రకటించారు. ఇరాన్-30%, అల్జీరియా-30%, లిబియా-30%. ఫిలిప్పీన్స్-25%, బ్రూనై-25%, మోల్డోవా-25% చెల్లించాలని తెలిపారు.
News July 10, 2025
రాజధాని రైతులు కోరినట్లే ప్లాట్లు: నారాయణ

AP: పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై మంత్రి చర్చించారు. ప్లాట్ల కేటాయింపుపై రైతులు కూడా తమ అభిప్రాయాలను మంత్రి నారాయణకు తెలియజేశారు. రైతులు కోరినట్లే ప్లాట్ల కేటాయింపు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.