News January 23, 2025
ప్రకాశం: భార్యను చంపి.. కుక్కర్‌లో ఉడకబెట్టాడు
రాచర్ల మండలం JP చెరువుకు చెందిన మాధవిని ఆమె భర్త హత్య చేసిన ఘటన HYDలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల క్రితం మాధవితో గురుమూర్తికి వివాహమైంది. ఇటీవల గొడవపడి భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందనుకొని మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలు పొడిచేసి, చెరువులో పడేశాడు. ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు’ అని తెలిపారు.
Similar News
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.
News February 4, 2025
ఒంగోలు: వైసీపీలో ఉండేది ఎవరు.?
ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.
News February 4, 2025
ప్రకాశం: రెండు రోజుల్లో ఇద్దరు మృతి
గత రెండు రోజులుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం పామూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లాకు చెందిన అశోక్ (21) అనే యువకుడు మృతి చెందాడు. జరుగుమల్లి మండలం పచ్చవకు చెందిన మాలకొండయ్య (60) పొలం చూసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా మరో బైక్ ఢీకొనడంతో ఆయన మృతి చెందారు.