News September 4, 2025

ప్రకాశం: మాతృ మరణాలను నివారించేందుకు చర్యలు

image

మాతృ మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా క్వాలిటీ అస్సూరెన్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ఏరియా వైద్యశాలలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు సూచించిన నిబంధనల మేరకు అస్సూరెన్స్ కమిటీ పనిచేయాలని సూచించారు.

Similar News

News February 20, 2026

CM వెలిగొండ పర్యటనపై కీలక సమావేశం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాజెక్ట్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అలాగే ఎల్లుండి సీఎంతో సమావేశం నేపథ్యంలో వివరించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు.

News February 20, 2026

ఉమ్మడి ప్రకాశం: కీలక సమావేశానికి రంగం సిద్ధం.!

image

ఈ నెల 22న అమరావతిలో CM చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇన్‌ఛార్జ్‌లు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిని విడివిడిగా సమీక్షిస్తూ, అభివృద్ధిలో వేగం పెంచేందుకు CM దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

News February 20, 2026

కంభంలో ACB దాడులు.. లంచం తీసుకుంటూ చిక్కిన అధికారి

image

మార్కాపురం జిల్లా కంభంలో శుక్రవారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పురుగు మందుల షాపు లైసెన్స్ మంజూరు కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి అధికారి లంచం డిమాండ్ చేశాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కంభం మండల వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్‌ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.