News January 6, 2026

ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.

Similar News

News January 7, 2026

మార్కాపురంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మార్కాపురంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఎస్ఐ సైదుబాబుకు సమాచారం అందింది. ఆయన అక్కడికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 7, 2026

మార్కాపురం: 10రోజుల్లో పనుల పూర్తి

image

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రకాశం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. నూతన కార్యాలయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోవారం పది రోజుల్లో పూర్తవుతాయన్నారు. అనంతరం ఇక్కడి నుంచి జిల్లా పరిపాలన మొదలవుతుందని తెలిపారు. సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మార్వో చిరంజీవి తదితర అధికారులు పాల్గొన్నారు.

News January 7, 2026

జగన్‌పై మంత్రి స్వామి విమర్శలు

image

పబ్లిసిటీ పిచ్చితో పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి స్వామి విమర్శించారు. కొండపి మండలం తాటాకులపాలెంలో ఆయన బుధవారం పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రికార్డులను తారుమారు చేయడానికి వీలులేని విధంగా కొత్తపాస్ పుస్తకాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రతి దశలో అన్నదాతకు అండగా ఉంటున్నామన్నారు.