News March 22, 2024
ప్రకాశం: ‘రాజకీయ ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి’

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అబ్జర్వర్లు, ఎన్నికల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు కనీసం 48 గంటల ముందుగా అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 3, 2025
ప్రకాశం: డబ్బులు చెల్లించండి.. కొత్త రుణాలు ఇస్తాం.!

ప్రకాశం జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు వారి బకాయిలను త్వరితగతిన చెల్లించాలని సంబంధిత శాఖాధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో జిల్లాలో 833 యూనిట్లకు గాను రూ.24.18 కోట్ల బకాయిలు ఉన్నట్లు, పాత బకాయిలను చెల్లించకపోవడంతో కొత్త రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 364 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
News September 3, 2025
ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News September 3, 2025
త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్‌వీల్ వ్యాన్- బైక్ ఒకదానికొకటి ఢీకొని ఓ మహిళ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.