News April 27, 2024
ప్రకాశం: రూ.20 లక్షలు స్వాధీనం

జిల్లాలోని పుల్లలచెరువు మండలం మల్లపాలెం చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఒంగోలుకు కారులో తీసుకెళ్తున్న అజీజ్ అనే వ్యక్తి నుంచి ఆ డబ్బును గుర్తించి, సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రూ.50 వేలకు మించి డబ్బులు ఉంటే సరైన పత్రాలు చూపించాలన్నారు.
Similar News
News September 10, 2025
ఆందోళన చెందవద్దని.. ప్రకాశం కలెక్టర్ పిలుపు!

రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.
News September 10, 2025
ప్రకాశం: పోస్టల్ స్కాలర్‌షిప్ పొందాలని ఉందా?

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అర్హత పొందేందుకు రాత పరీక్ష, ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30న రీజనల్ స్థాయి పరీక్ష ఉండగా, ఆసక్తి కలవారు ఈ నెల 16లోగా స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించాలి.
News September 10, 2025
రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.