News May 19, 2024
ప్రకాశం: రైలు పట్టాలపై మృతదేహం

జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామ సమీపాన గల రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. రైలు పట్టాల మధ్య సదరు వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుడి వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైలు కిందపడి ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News February 25, 2026
ఇవాళ మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.