News January 28, 2026

ప్రకాశం: రైలొచ్చిందంటే..అన్నీ అవుతాయ్.!

image

నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే‌లైన్ ప్రాజెక్ట్‌తో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనుంది. దీంతో ఎన్నో గ్రామాల ఆశ ఇప్పుడు పట్టాల మీద పరుగులు తీస్తోందని BJP ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పటికే 88.65 KM పూర్తైన రైల్వే లైన్‌తో దర్శి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రాపూరులు భారత రైల్వే మ్యాప్‌పై గర్వంగా నిలుస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం పట్టాలు వేసింది రైలుకే కాదు.. బంగారు భవిష్యత్తుకి అని ‘X’లో కొనియాడారు.

Similar News

News February 19, 2026

ప్రశాంతంగా పరీక్షలు రాయండి: మంత్రి స్వామి

image

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్‌కి అర్హత సాధించినట్లు తెలిపారు.

News February 19, 2026

24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

image

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.

News February 19, 2026

పొదిలి: ఒక్కో ప్లేట్‌కు రూ.50.. మిమ్మల్నీ అడిగారా?

image

పొదిలిలో విద్యుత్ సర్వీసు నంబర్ ప్లేట్లు బిగించి ప్రతి ఒక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పాత ప్లేట్ ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా కొత్త ప్లేట్ పెట్టాలంటూ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా.. తమకు సంబంధం లేదని.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వాటిని బిగిస్తున్నారని చెప్పారు.