News December 23, 2025
ప్రకాశం: వలస కూలీతో ఎఫైర్.. భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ భార్య హత్య చేసింది. ఈ ఘటన HYDలోని బోడుప్పల్‌లో జరిగింది. అక్కడ నివసించే అశోక్(45), పూర్ణిమ(36) భార్యాభర్తలు. ప్రకాశం జిల్లాకు చెందిన వలస కూలీ మహేశ్(22)తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 11న అశోక్‌ను పూర్ణిమ, మహేశ్, సాయికుమార్ కలిసి కింద పడేసి చున్నీలతో గొంతు బిగించి హత్య చేశారు. గుండెపోటుగా చిత్రీకరించినా, పోలీసుల విచారణలో నిజం తేలింది.
Similar News
News December 27, 2025
ప్రకాశం జిల్లాలో డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ.!

ప్రకాశం జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించనున్నారు. జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 2,82,576 మంది పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం రూ.1,25,25,500 నిధులు విడుదలయ్యాయి. 30న సచివాలయ సిబ్బంది నగదును డ్రా చేయనున్నారు.
News December 27, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మళ్లీ మార్పులు.!

ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అభ్యంతరాలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పొదిలిని ప్రకాశం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో కలిపే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
ప్రకాశం: డిసెంబర్ 31 జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ.!

జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించనున్నారు. జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 2,82,576 మంది పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం రూ.125కోట్ల 2లక్షల 5వేల 5వందల నిధులు విడుదలయ్యాయి. 30వ తేదీన సచివాలయ సిబ్బంది నగదును డ్రా చేయనున్నారు.


