News October 10, 2024
ప్రకాశం: విధులకు వస్తూ MRO మృతి

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.
Similar News
News September 15, 2025
ప్రకాశంలో ఇంజినీర్ల అద్భుతానికి నిదర్శనం ఇదే!

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి నంద్యాల వరకు 60 కి.మీ రహదారి ఉంది. ఇందులో 25 కి.మీ ప్రయాణం ఘాట్ రోడ్డులో ఉంటుంది. స్వాతంత్ర్యం రాకముందు నిర్మించిన రైల్వే పురాతన వంతెనల దిమ్మెలు నేటికీ కనిపిస్తున్నాయి. నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఈ ఘాట్ రోడ్డు అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇంజినీర్లు సృష్టించిన అద్భుతాలకు ఇదో ఉదాహరణ.
News September 15, 2025
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన జిల్లా వాసే

నేడు ఇంజనీర్స్ డే. దేశమంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరిస్తుంది. ఇంజినీర్లందరూ ఆయనే ఆదర్శమని గర్వంగా చెబుతుంటారు. ఆయన జయంతి సందర్భంగానే ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు బి.పేట మండలంలోని మోక్షగుండం వాసులే. ఈయనను మోక్షగుండం ప్రజలు నేటికీ ఆరాధిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్‌లో వంతెనలు నిర్మించి వరదల నుంచి కాపాడిన ఘనత ఈయన సొంతం.
News September 15, 2025
పూర్వ ఎస్పీ దామోదర్‌కు ఘనంగా వీడ్కోలు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.